కరెన్సీ తో అమ్మవారికి అలంకరణ
తెలంగాణ జ్యోతి ఏటూరునాగారం : మండలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరా త్రులలో భాగంగా ఆరోవ రోజు మంగళవారం అమ్మవారిని మహాలక్ష్మిదేవిగా రూ.6లక్షల 32 వేల 560ల కరెన్సీ నోట్లు, 2 వేల రూపాయల విదేశి నోట్లతో అమ్మవారిని అలంకరించారు. దీంతో గ్రామంలోని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాలను సమర్పించారు. కార్యక్రమంలో భవాని స్వాములు,ఆలయ కమిటీ, దుర్గాకమిటీ సభ్యులు పాల్గొన్నా రు. అదేవిధంగా కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద అమ్మవా రిని మహాలక్ష్మిదేవిగా కరెన్సీనోట్లతో అలంకరించారు. అలాగే సాయిబాబా ఆలయం, ముత్యాలమ్మ, క్రాస్‌రోడ్డు వద్ద అమ్మ వారు భక్తులకు మహాలక్ష్మీగా దర్శనమిచ్చారు. భవాని మాల ధారులు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలను అమ్మ వారికి సమర్పించారు.అంతేకాకుండా అమ్మవారి నామస్మరణ తో మార్మోగింది.