వెంకటాపురం మండలంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ వెంకట రావు విస్తృత పర్యటన
వెంకటాపురం మండలంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ వెంకట రావు విస్తృత పర్యటన
– పాలెం వాగు ప్రాజెక్టులో చేప పిల్లల విడుదల
– బాలల దినోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : భద్రాచలం శాసన సభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గురువారం విస్తృతంగా పర్యటిం చారు. ఈ సందర్భంగా మండలంలోని రాచపల్లి మల్లాపురం లో ఉన్న పాలెం వాగు ప్రాజెక్టు రిజర్వాయర్లో చేప పిల్లలను విడుదల చేశారు. అలాగే బాలల దినోత్సవం సందర్భంగా పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పాలెం ప్రాజె క్టు ప్రాంతమైన రాచపల్లి మల్లాపురం చుట్టుపక్కల గ్రామాల ఆదివాసి రైతులు అనేక సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు.సుమారు12 వేలఎకరాలకుసాగునీరు అందిం చే పాలెం ప్రాజెక్టు ప్రధాన కాలువలు, ఇంటర్నల్ పిల్ల కాలువ లు మరమ్మత్తులు నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా చర్య లు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులు సమక్షంలోనే పాలెం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో చరవాణి ద్వారా కాలువ ల మరమ్మతులు కు వెంటనే నిధులు విడుదల చేసి పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటి సమగ్ర సర్వే కార్యక్రమాన్ని కూడా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంక ట్రావు పరిశీలించి, ప్రభుత్వపరమైన సర్వే కార్యక్రమంలో ప్రతి ఒక్క కుటుంబం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలలో కుటుంబ సర్వే కూడా ప్రధాన భాగం అని తెలిపారు. నియోజకవర్గం లోని వెంకటాపురం, వాజేడు మండలంలో 33 చెరువులతో పాటు, పాలెం ప్రాజెక్టు జలాశయంలో మత్స్య సంపద పెంపొం దించేందుకు ప్రభుత్వపరంగా నూరు శాతం సబ్సిడీతో చేప పిల్లలపెంపకాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. గిరిజన మత్స్య కారుల సొసైటీ ఆధ్వర్యంలో, పాలెం ప్రాజెక్టు రిజర్వాయర్లో ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో విడుదల చేసి సంబంధిత సహకా ర సంఘానికి పలు సూచనలు చేశారు. అలాగే బకాయిలు చెల్లించాలని సంబంధిత అధికారులతో చరవాణి ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దా ర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఫిషరీస్ శాఖ అధి కారులతో పాటు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిడెః మోహ న్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివరావు ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీరాములు రమేష్, ఎంపీటీసీ రవి, సీతాదేవి పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులతోపాటు, వాజేడు మండల కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొ న్నారు. వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.