మల్లంపల్లిలో అగ్ని ప్రమాదాల నియంత్రణ చర్యలపై అవగాహన
ములుగు : అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా అగ్నిమాపక కేంద్ర అధికారి ఎండి అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో మండలంలోని మల్లంపల్లి లో గల బాలాజీ హాస్పిటల్ నందు అగ్ని ప్రమాదాల నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలనేవి అనుకోకుండా సంభవిస్తాయని జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పీ.మహేశ్వర్, ఎల్ ఎఫ్ టీ. రమేష్, డిఓపి జే. సురేందర్, ఎఫ్ఎం బీ. దన్సింగ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు
.