రావి ఆకులపై అపురూప చిత్రాలు – దేవర రమేష్ డ్రాయింగ్ మాస్టర్.
తెలంగాణ జ్యోతి ప్రతినిధి, ఏటూరు నాగారం : మండలం లోని చిన్న బోయిన పల్లి ఆశ్రమ పాఠశాలలో డ్రాయింగ్ మాస్టర్ గా పనిచేస్తున్న దేవర రమేష్ గత కొంత కాలంగా రావి ఆకులపై సందర్భాన్ని బట్టి ఆర్ట్ ద్వారా రావి ఆకులపై బొమ్మల గీయడం జరుగుతుందన్నారు. గతంలో బిఆర్ అంబేద్కర్, తెలంగాణ రాష్ట్ర సమితి సచివాలయం, లాంటివి ఎన్నో రావి ఆకులపై ప్రదర్శించి విద్యార్థులకు నేర్పుతూ ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులచే సన్మానాలు, అధికారుల మన్ననలు పొందాడు. శ్రీరామనవమి సందర్భంగా శివపార్వతులను రావి ఆకుపై ఆర్ట్ ద్వారా ప్రదర్శించి తన యొక్క విజ్ఞాన్నాన్ని ప్రదర్శించాడు.