కుల గణన ఎన్యుమరేటర్లకు శిక్షణ
వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆదే శాల మేరకు బుదవారం సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ, కుల గణన సర్వే కొరకు నియమించిన ఎన్యుమ రేటర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ కార్యక్రమ మును మండల ప్రత్యేక అధికారి మహమూద్ ప్రారంభిం చారు. సర్వేను విజయవంతం చేయుటకు ఎన్యుమరేటర్లకు తగు సూచనలు,సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి రాజేంద్ర ప్రసాద్, తహసిల్దారు లక్మి రాజయ్య, మండల పంచాయతీ అధికారి, మండల విద్యాధికారి జివివి సత్యనారాయణ, ఏపీఎం లతో పాటు తదతరులు పాల్గొన్నారు.