అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ తనిఖీ
వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలం జాతీయ రహదారి 163 పై చెరుకూరు గ్రామం వద్ద ఏర్పాటుచేసిన చెక్ పోస్టును బుధవారం ములు గు జిల్లా పౌరసరఫరాల శాఖ అదికారి తనిఖీలు నిర్వహిం చారు. సరిహద్దులోని చతిస్గడ్ ఇతర రాష్ట్రాల నుండి ఎటు వంటి అనుమతులు లేకుండా ధాన్యం, ఇతర పంటలు అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్ట్ సిబ్బంది ఎల్లవేళలా అప్రమ త్తంగా ఉండాలని, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఆదేశిం చారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలతో ఆదేశాలు జారీ చేసినట్లు వాజేడు తాసిల్దార్ డీవీబి ప్రసాద్ విలేకరులకు తెలిపారు.