ఎన్.హెచ్.ఆర్సీ కన్నాయిగూడెం మండల అధ్యక్షులుగా సునార్కని శ్యామ్

ఎన్.హెచ్.ఆర్సీ కన్నాయిగూడెం మండల అధ్యక్షులుగా సునార్కని శ్యామ్

– ప్రధాన కార్యదర్శిగా వాసంపల్లి మధుకర్

– రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఆదేశాల మేరకు నియామకం

తెలంగాణజ్యోతి,కన్నాయిగూడెం:జాతీయ మానవ హక్కు ల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) కన్నాయిగూడెం మండల అధ్య క్షులుగా సునార్కని శ్యామ్,మండల ప్రధాన కార్యదర్శి వాసం పల్లి మధుకర్లను బుధవారం నియమించడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పెట్టేం రాజు అనుమతితో జాతీయ మానవ హక్కుల కమిటీ ములుగు జిల్లా నాయకులు గంపల శివ కుమార్ ఆధ్వర్యంలో కన్నాయిగూడెం మండల కమిటీని  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కన్నాయిగూడెం మండల అధ్యక్షులుగా నియమితులైన సునార్కాని శ్యామ్ మాట్లాడు తూ రాష్ట్ర,జిల్లా కమిటీల ఆదేశాల మేరకు సంస్థ బలోపేతం కోసం,పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజ్యాంగ చట్టాలకు లోబడి నీతి నిజాయితీతో తనకిచ్చిన పదవిని విజయవంతంగా నిర్వహిస్తామని అన్నారు. తనకు ఈ పదవి రావడానికి కృషిచేసిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య,జిల్లా అధ్యక్షులు పెట్టెం రాజు,జిల్లా ఉపాధ్యక్షులు గాదె శ్రీనివాసచారి,రాష్ట్ర కమిటీ సభ్యులు కుంట ఏడుకొండ లు, ములుగు జిల్లా ఎన్నికల ఇన్చార్జి కొడిపాక రవి, జిల్లా నాయకులు ఏటూరునాగారం మండల అధ్యక్షులు గంపల శివకుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment