నేరాల నియంత్రణకై కార్డెన్ సెర్చ్ నిర్వహణ
– కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : నేరాల నియంత్రణకై కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తుఎన్నామని ఎస్సై వెంకటేష్ అన్నారు. బుధవారం గుట్టల గంగారం గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహిం చారు. అనంతరంం ఎస్సై మాట్లాడుతూ యువత చెడు వ్యస నాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి సేవించి న,విక్రయించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలను నడపడం నేరమని, అజాగ్రత్తగా నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుం దన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లి దండ్రు లపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. పలు గ్రామాల్లో కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందిం చాలని కోరారు. వాహనదారులు అన్ని రకాల ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ ఎస్సై రఘు,సివిల్ మరియు బెటాలియన్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.