ముత్యం ధార జలపాతం సందర్శన నిషేధంపై అవగాహన సమావేశం.
ముత్యం ధార జలపాతం సందర్శన నిషేధంపై అవగాహన సమావేశం.
– హాజరు కానున్న ములుగు జిల్లా అదనపు కలెక్టర్.
వెంకటాపురంనూగూరు,తెలంగాణాజ్యోతి:ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం రిజర్వ్ ఫారెస్ట్ లోని ముత్యంధార జలపాతం సందర్శనను ప్రభుత్వ నిషేధించింది. అయినా కానీ కొంతమంది సందర్శకులు అధికారులను, సిబ్బందిని కళ్ళుగప్పి ముచ్చందార జలపాతం తిలకించేం దుకు దొడ్డిదారిన వెళ్ళి గత ఏడాది ముచ్చందార జలపాతాన్ని తిలకించేందుకు వెళ్లిన వారు భారీ వర్షాలు కారణంగా దారిలో వున్న వాగులు పొంగటంతో వరదల్లో చిక్కుకు పోయారు. సందర్శకులు.వరదల్లో చిక్కుకు పోఇన సంఘటన మీడియాలో వైరల్ అఇంది. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ముచ్చందార జలపాతం యాత్రికులను కాపాడేం దుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం, విశేష కృషి చేసి, వారిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రాష్ట్ర అటవీశాఖ రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించి, ముత్యం ద్వారా జలపాతం సందర్శకులను నిలిపి వేసింది. కాగా వీరభద్ర వరం ముచ్చందార జలపాతం సందర్శన, నిషేధ ఉత్తర్వులు పై అవగాహన కల్పించేందుకు, బుధవారం వీరభద్రవరం పంచాయతీ కార్యాలయంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అందరికీ అవగాహన కల్పించేందు కు ప్రబుత్వ పరంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ములుగు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని, ముచ్చందార జలపాతం సందర్శన నిషేధంపై అవగాహన కల్పించనున్నారు. ఈ మేరకు బుధవా రం ఉదయం వీరభద్రవరం పంచాయతీ కార్యాలయంలో అవగాహన సమావేశం నిర్వహించనున్నట్లు మండల పంచా యతీ అధికారి హనుమంతరావు మీడియా కు విడుదల చేసిన ప్రకటనలో హాజరు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.