ఐ రిస్క్ గ్రామాల్లో మలేరియా ఇంటింటి సర్వే 

Written by telangana jyothi

Published on:

ఐ రిస్క్ గ్రామాల్లో మలేరియా ఇంటింటి సర్వే 

 తెలంగాణ జ్యోతి, వాజేడు : మండలంలోని మురుమూరు గ్రామపంచాయతీలోని ఐ రిస్క్ గ్రామాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అల్లం అప్పయ్య ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా, డెంగ్యూ,  టైపాడు లాంటి విష జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వైద్యాధికారులు సూచించారు. ఇంటి చుట్టూ శుభ్రత ఈగలు దోమలు చేరకుండా నీటి నిలువలు నీటి గుంతలు పాత గాబులు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటింటి సర్వే నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఐ రిస్కు గ్రామాలలో మొదటి విడత దోమల మందు పిచికారి చేయించి ఇంటింటికి వాజేడు వైద్యాధికారులు వర్షాకాలం వచ్చే వ్యాధుల పట్ల వాజేడు వైద్య అధికారులు వైద్య బృందాలుగా ఏర్పడి వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వాజేడు వైద్య అధికారి కొమరం మహేంద్ర, సిహెచ్ సూర్యప్రకాశ్రావు,  సూపర్వైజర్ కోటిరెడ్డి, వెంకటరమణ, హెల్త్ అసిస్టెంట్ శేఖర్, చిన్న వెంకటేశ్వర్లు,  ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment