జిల్లాలో ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు

 

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు

– జిల్లాలో మొదటి విడతగా 22 కేంద్రాలు ప్రారంభం

– జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

తెలంగాణ జ్యోతి ప్రతినిధి, ఏటూరునాగారం :  రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు ములుగు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం ఏటూరునాగారం ఆకులవారి గణపురం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్. మహేందర్ జి తో కలిసి ప్రారంభిం చారు. అనంతరం ఏటూరు నాగారం మండలంలోని రైతు వేదికలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి ధాన్యం కొనుగోలు పై శిక్షణ తరగతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ములుగు జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించడం కోసం 144 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో సోమవారం నుంచి ములుగు 3 , వెంకటాపూర్ 3, గోవిందరావుపేట 3, తాడ్వాయి 3, ఏటూరు నాగారం 3, మంగపేట 2, వెంకటాపురం 2 , కన్నాయిగూడెం 1, వాజేడు 1 , మండలాలలో రైతులకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.ఏప్రిల్ రెండవ వారం లో 73 , మూడవ వారం లో 49 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.రైతులు కష్టపడి శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరపై రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసి డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయాలని అన్నారు. గ్రేడ్ ఏ రకం వరి ధాన్యానికి ప్రభుత్వం 2,203 రూపాయలు , సాధారణ రకం వరి ధాన్యానికి 2,183 రూపాయల మద్దతు ధర తో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.  ఇతర రాష్ట్రంలో పండించిన ధాన్యం మన జిల్లాలోకి రాకుండా వాజేడు మండలం పేరూరు గ్రామం లో అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశామని మూడు షిఫ్ట్ లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని అన్నారు. రైతులు కాలానుగుణంగా పంట మార్పిడి పై దృష్టి పెట్టాలని వేసవికాలంలో తక్కువ నీరుతో పండించే పంటలపై అవగాహన పెంచుకొని సాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై మేనేజర్ రాంపతి, డి ఏ వో విజయ్ చంద్ర , డి సి ఓ సర్దార్ సింగ్, గిరిజన సహకార సంస్థ మేనేజర్ దేవా, స్థానిక ఎమ్మార్వో జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.