ఏటూరునాగారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గంట కృష్ణారెడ్డి
ఏటూరునాగారం, ఏప్రిల్ 23, తెలంగాణ జ్యోతి: ఏటూరునాగారం మండల యూత్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా గంట కృష్ణారెడ్డి (ఠాగూర్) ను నియమించారు. రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ.ఎస్.ఆర్ ఖాన్ ఈ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గంట కృష్ణారెడ్డి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు మరియు జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.









