వెంకటాపూర్ జర్నలిస్టుల కాలనీని సందర్శించిన మంత్రి సీతక్క
– ఇంటిస్థలాలకు పట్టాలిప్పించేందుకు కృషి చేస్తానని హామీ
– కృతజ్ఞతలు తెలియచేసిన జర్నలిస్టులు
ములుగు, డిసెంబర్18, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జర్నలిస్టులు గత కొద్దిరోజులుగా పాలంపే ట గ్రామంలోని ప్రభుత్వ భూములో రేకులతో ఇంటి నిర్మాణాలు చేపట్టి శాంతియుతంగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.. కాగా, ఇటీవల మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క సోమవారం వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం పాలంపేట గ్రామంలో ఇండ్లు వేసుకొని దీక్ష చేస్తున్న జర్నలిస్టుల కాలనీ వద్దకు చేరుకుని జర్నలిస్టుల కు మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు సీతక్క కు పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ క్రమంలో సీతక్క మాట్లాడుతూ వెంకటాపూర్ జర్నలిస్టుల తో పాటు జిల్లా లోని అన్ని మండలాల్లో జర్నలిస్టుల కు ఇండ్ల స్థలాలు ఇప్పించేం దుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముందుగా వెంకటాపూర్ మండలం జర్నలిస్టులు పాలం పేట గ్రామంలో వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇప్పించేందు కు కృషి చేస్తానని అన్నారు. దీంతో వెంకటాపూర్ జర్నలిస్టులు సీతక్క కు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సీతక్క వెంట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు బాదం ప్రవీణ్, బైరెడ్డి భగవాన్ రెడ్డి, చెన్నోజు సూర్యనారాయణ, బండి శ్రీను, జర్నలిస్టులు బేతి సతీష్, ఒద్దుల మురళి, అలుగొండ రమేష్, మునిగల రాజు, కేతిరి భిక్షపతి, రాంగీశెట్టి రాజేందర్, పిల్లల మర్రి శివ, పిల్లలమర్రి రామ్, తీగల యుగేందర్, దేశిని వినీల్, విక్రమ్, సారంగం, అశోక్, రఫీ, రవిరాజా, ప్రశాంత్, ఇంద్రాదేవి, చంద్రమౌళి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.