కన్నాయిగూడెంలో కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ

కన్నాయిగూడెంలో కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ

కన్నాయిగూడెంలో కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ

తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రజా యుద్ధ వీరుడు కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించగా ఎహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోడెం బాబు జెండా ఆవిష్కరిం చారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా యూత్ కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనసరి సూర్య, ములుగు మాజీ జడ్పిచైర్మన్ బడే నాగజ్యోతి, ఎహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్, ఎఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవిలు హాజరై కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… కొమురం బీమ్ ఆదివాసీ సమాజానికి చేసిన సేవలు గుర్తు చేశారు. కొమురం భీం పేరు వింటేనే ఆదివాసీ జాతి విముక్తి పోరాటాలకు ఒక ఉప్పెన లాంటి ధైర్య మని కొమురం భీం జీవితంలో పోరాటం ఒక ఆదివాసీ జాతికే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర యుద్ధమానికి ఒక ఆయువు పట్టుగా మారిందన్నారు. బానిస సంకెల్ల నుండి విముక్తి ఎలా అని దిశ నిర్దేశం చేసిందని, అందుకే ఎల్లలు దాటి నేడు కొమురం భీం పేరు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిం దన్నారు.  కొమురం భీం జల్ జంగిల్ జమిన్, మా ఊరిలో మా రాజ్యం, అనే నినాదం తో పోరాడి నేడు ఆదివాసీ లకు హక్కులు కల్పించిన గొప్ప త్యాగ యుద్దవిరుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ పోదెం వీరయ్య, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘం, ఆదివాసీ ఉద్యోగ సంఘం, ఆదివాసీ మహిళా సంఘం, ఆదివాసీ రైతు సంఘం, ఆదివాసీ నాయకపోడు సంఘం నాయకులు, కన్నాయిగూడెం, మండలంలోని పలు గ్రామాల ఆదివాసీ యూత్ కమిటీ, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు యువకులు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “కన్నాయిగూడెంలో కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ”

Leave a comment