ములుగు జిల్లా కబడ్డీ జట్టుకు టీ షర్ట్స్ పంపిణీ
– సీనియర్ క్రీడాకారుడు గోగు రాజయ్య స్వరూప
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : గోగు శ్రీను స్మారకార్ధంగా ఈనెల 4 నుండి 7 వరకు అదిలాబాద్ జిల్లాలో జరగబోయే 71 వ సీనియర్ పురుషుల విభాగం రాష్ట్రస్థాయి పోటీలకు వెళుతున్న టువంటి ములుగు జిల్లా కబడ్డీ జట్టుకు టీ షర్ట్స్ గోగు రాజయ్య స్వరూప పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజయ్య స్వరూప మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలో ములుగు జిల్లా జట్టు అత్యున్నత ప్రతిభ కనబరిచి జిల్లా పేరును నిలబెట్టాలని అన్నారు. అసోసియేషన్ కు క్రీడాకారులు ఎల్లప్పుడూ విశ్వాసులుగా ఉంటూ ముందుకు నడిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోలేపాక జనార్ధన్, ఉపాధ్యక్షులు చింత కృష్ణ, జాయింట్ సెక్రెటరీ కట్టెకోల్ల వెంకటేష్, సభ్యులు మద్దెల నవీన్, పసరగొండ భాస్కర్, కోట సంపత్, గోగు అన్వేష్, తదిత రులు పాల్గొన్నారు.