నైపుణ్యాల పెంపుకు టాస్క్ ఉపయోగపడుతుంది
– జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్
– టాస్క్ తరగతులు ప్రారంభం
ములుగు ప్రతినిధి : జిల్లాలోని యువతకు ఉద్యోగాలు సాధించేందుకు గాను నైపుణ్యాలు పెంచుకునేందుకు టాస్క్ శిక్షణా కేంద్రం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. నైపుణ్యాలను పెంపొందించుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టాస్క్ రీజినల్ సెంటర్ లో టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సులలో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. సోమవారం ములుగులో ప్రారంభ మైన టాస్క్ శిక్షణా తరగతులను కలెక్టర్ దివాకర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థులకు శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని, నిరుద్యోగ యువతలో ప్రతిభ నైపుణ్యాలు పెంపొందించడానికి టాస్క్ ద్వారా శిక్షణ, ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారని అన్నారు. టెక్నికల్ విభాగంలో శిక్షణలో భాగంగా జావా ప్రోగ్రామింగ్, వెబ్ డెవలప్మెంట్, పైథాన్ ప్రోగ్రామింగ్, డేటాబేస్ అప్లికేషన్స్, సీ ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్, సూడో కోడ్, ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ మొదలగు కోర్స్ లలో ఉద్యోగ మెళకువలు నేర్పించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా కింగ్ పోటీ పరీక్షలకు (పీవో, క్లర్క్, స్పెషల్ లిస్ట్ ఆఫీసర్స్) అనగా ఐబీపీఎస్, ఎస్బీఐ, రూరల్ బ్యాంక్స్, కో-ఆపెరేటివ్ బ్యాంక్స్ నోటిఫికెషన్స్ కి సంబంధించిన శిక్షణ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను అంది పుచ్చుకోవాలని యువతను కోరారు. టాస్క్ రీజినల్ సెంటర్ ద్వారా శిక్షణ తరగతులు కోర్సులకు సంబంధించి పూర్తి వివరాలకు 9618449360 నెంబరులో సంప్రదించాలని, తరగతులకు హాజరైన వారికి టాస్క్ ద్వారా జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు టాస్క్ రీజినల్ సెంటర్ హెడ్ నవీన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమలో క్లస్టర్ మేనేజర్ సుధీర్ తెలిపారు.
1 thought on “నైపుణ్యాల పెంపుకు టాస్క్ ఉపయోగపడుతుంది”