కలకలం రేపిన ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని ఆత్మహత్యాయత్నం

కలకలం రేపిన ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని ఆత్మహత్యాయత్నం

కలకలం రేపిన ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని ఆత్మహత్యాయత్నం

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని ధనలక్ష్మి తన నివాస గృహంలో చేతిపై కత్తితో కోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఉదయం కారు డ్రైవర్ ఉదయం ఆమె ఇంటికి వెళ్ళగా పరిస్థితిని గమనించి వెంటనే హుటాహుటిన వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే ఆమెకు చికిత్స చేసిన డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ ఐసిడిఎస్ ప్రాజెక్టులో సూపర్వైజర్ గా పని చేస్తున్న ధనలక్ష్మిని, 2024 నవంబర్ నెలలో వెంకటాపురం సిడిపిఓగా బదిలీ చేశారు. ప్రాజెక్టు కార్యాలయంలో సూపర్వైజర్లకు ,సిడిపిఓకు మధ్య అంతర్గత కలహాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేసి సస్పెండ్ చేపిస్తా మని ప్రచారంతో భయభ్రాంతులకు, గురై న ఆమె మనోవేదనకు గురై తాను ఆత్మహత్యా యత్నాన్ని పాల్పడినట్లు చికిత్స పొందుతున్న సిడిపిఓ ధనలక్ష్మి మీడియాకు తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తానని, ప్రాజెక్టు కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు అందరితో కుటుంబంగా కలిసిమెలిసి పనిచేస్తానని, అయితే కొంతమంది కావాలని తప్పుడు ఫిర్యాదు చేస్తూ, తనను మానసిక వేదనకు గురి చేస్తున్నారని సిడిపిఓ ధనలక్ష్మి తెలిపారు. సిడిపిఓ ధనలక్ష్మి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. వెంకటాపురం ప్రాజెక్టు పరిధిలో వాజేడు, వెంకటాపురం మండలాల్లో 168 అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయి. వెంకటాపురం మండలం లో 94, వాజేడు మండలంలో 74 కేంద్రాలు ఉన్నాయి. సిడిపిఓ ఆత్మహత్య సంఘటన మీడియా ద్వారా తెలుసుకున్న పలువు రు అంగన్వాడి టీచర్లు, కార్యకర్తలు, ఆయాలు వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలి వచ్చి సిడిపిఓ ధనలక్ష్మిని పరామర్శించారు. ఆమె ఆత్మహత్య సంఘటనకు సంబం ధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె ఆత్మహత్యపై ఐసిడి ఎస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment