గణిత పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క.
ములుగు తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో పత్తిపల్లి పాఠశాల గణిత ఉపాధ్యాయుడు సుతారి మురళీధర్ రూపొందిం చిన ” హైలైట్స్ అఫ్ హై స్కూల్ మాథమాటిక్స్” పుస్తకాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరణ చేసి అభినందనలు తెలిపారు. సంఖ్యాభావన, బీజగణితం, అంక గణితం, జ్యామితి, క్షేత్ర గణితం, దత్తాంశ నిర్వ హణ, త్రికోణమితి మొదలైన అధ్యాయాలు 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు ఈ పుస్తకం చక్కగా ఉపయోగపడుతుందని జాతీయ ఉత్తమ ఉపాధ్యా య అవార్డు గ్రహీత కందాల రామయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి పాణిని, ఏ.యమ్.ఓ బద్దం సుదర్శన్ రెడ్డి, పత్తిపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యులు సి. ప్రేమలత, ఉపాధ్యాయులు రాజు, పల్లె వెంకట శ్రీనివాస్, జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్, గణిత ఉపాధ్యాయులు మురళీధర్ కు అభినందనలు తెలిపారు.
గణిత పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క.
Written by telangana jyothi
Published on:
1 thought on “గణిత పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క.”