ములుగు కాంగ్రెస్ కార్యదర్శిగా బొల్లె భాస్కర్
పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం
కన్నాయిగూడెం, ఏప్రిల్ 8, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా బొల్లె భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని భాస్కర్ పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కార్యకర్తలతో సమన్వయం కల్పిస్తూ పార్టీని మరింత బలపరచడం తన లక్ష్యమని తెలిపారు.










