అత్యుత్తమ ప్రతిభతో మెరిసిన విద్యార్థులు
ములుగు, మే2, తెలంగాణజ్యోతి: నూతన యాజమాన్యంతో ముందుకు సాగుతున్న బ్రిలియంట్ & వివేకవర్ధిని పాఠశాలలో విద్యార్థులు అద్భుత ఫలితాలతో ప్రతిభ చాటారు. ఎస్. మృదుల 569 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలవగా, పి. విష్ణవి 561 మార్కులు, ఎం. వెంకట్ 552 మార్కులు సాధించి విశిష్ట ఫలితాలు నమోదు చేశారు. ఈ విజయాలపై పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించింది. డైరెక్టర్లు చిర్రా నరేష్ గౌడ్, ముద్దం సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ విద్యార్థుల కృషి, పట్టుదలే ఈ ఫలితాలకు కారణమన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయుల మార్గదర్శకం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో తోడ్పడిందన్నారు. పాఠశాల లో నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని వెల్లడించారు. ఈ విజయాలు పాఠశాలకు మరింత గౌరవాన్ని తీసుకువచ్చాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.









