వెంకటాపురం కేజీబీవి స్కూల్లో చట్టాలపైన అవగాహన సదస్సు.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం లోని కెవిజివిబి పాఠశాల బాలికలకు హక్కులు ,చట్టాలపై మంగళవారం అవ గాహన సమావేశం సదస్సు నిర్వహించారు. సఖి లీగల్ కౌన్సిలర్ ప్రణయ్ ప్రసాద్ లాయర్ మాట్లాడుతూ బాలల యొక్క హక్కుల గురించి మరియు ఫోక్స్ చట్టాల గురించి, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్య లు,మరియు సమస్య ఎదురైనప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ 181 గురిం చి వివరించడం జరిగింది.పిల్లలు ఎవరైనా సమాజంలో ఎదుర్కొం టున్న సమస్యల గురించి బంధు వులు గాని చుట్టు పక్కలగానే ఎవరైనా పిల్లలను ఇబ్బంది పెడితే సఖి కేంద్రం టోల్ ఫ్రీ నెంబర్క్ సమాచారం ఇవ్వవలసిందిగా సఖి లీగల్ అడ్వకేట్ ప్రణయ్ ప్రసాద్ పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అనంతరం జడ్పిటిసి పాయం రమణ చేతుల మీదుగా సఖి పోస్టర్ ను విడు దల చేశారు. ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ , జడ్పిటిసి పాయం రమణ, హెచ్ఎం సునీత ,,సఖి సిబ్బంది లీగల్ కౌన్సిలర్ ప్రణయ్ ప్రసాద్, సైకో సోషల్ కౌన్సిలర్ కల్పనా, కేసు వర్కర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.