10th exams | పకడ్బందిగా పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ : సిఎం రేవంత్ రెడ్డి

10th exams | పకడ్బందిగా పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ : సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, తెలంగాణ జ్యోతి :  త్వరలో జరుగనున్న పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందిగా, ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ, పరీక్షల సమయంలో విద్యార్థులు  ఏమాత్రం ఒత్తిడికి లోను   కాకుండా సాఫీగా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో విద్యా శాఖ పై సి.ఎం. సమీక్షా సమావేశం నిర్వ హించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నత విద్యా శాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, విద్యా శాఖా కార్య దర్శి వాకాటి కరుణ, సి.ఎం .ఓ కార్యదర్శి శేషాద్రి, విద్యా శాఖా కమీషనర్ దేవసేన లు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో పనిచేస్తున్న విశ్వ విద్యా లయాల పనితీరుపై సవివరమైన నివేదిక అందచేయాలని అధి కారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో విశ్వ విద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదిక తోపాటు, రాష్ట్రంలో ఎక్కడ జూనియర్ కళాశాలలు అవసరం ఉన్నాయో వాటి వివరాలు వెంటనే సమర్పించాలని కోరారు. ప్రధానంగా బాలికల కోసం జూనియర్ కళాశాలలు ఎక్కడ అవసరమో పరిశీలించి వాటికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment