ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా…
– ములుగులో ఎక్కెల యువతి బైఠాయింపు
– నాలుగేళ్లుగా ప్రేమించి మొహం చాటేశాడని ఆరోపణ
– ప్రేమికులిద్దరూ ఫారెస్ట్ బీట్ అధికారులే.?
ములుగు ప్రతినిధి : నాలుగేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రేమికురాలు బైఠాయించిన సంఘటన ములుగు జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎక్కెల గ్రామానికి చెందిన యువతి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తోంది. అదే శాఖలో బీట్ అధికారిగా పని చేస్తున్న శ్రీధర్ యువతితో నాలుగేళ్లు ప్రేమిస్తు న్నానని నమ్మించాడు. పెళ్లి మాట వచ్చేవరకు మొహం చాటేయడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. అయినా కూడా యువకుడు పెళ్లికి నిరాకరించడంతో సోమవారం ములుగులోని శ్రీధర్ ఇంటి ముందు తల్లిదండ్రులు, బంధువులతో కలిసి తనకు న్యాయం చేయాలని బైఠాయించింది. ప్రేమించిన శ్రీధర్ తనను పెళ్లి చేసుకోకుంటే బలవన్మరణానికి పాల్పడుతానని యువతి పేర్కొంది. కాగా, ప్రేమికులు ఇద్దరు అటవీ శాఖలో పనిచేస్తుండడంతో ఈ సంఘటన సర్వత్ర చర్చనీయాంశమైంది.
1 thought on “ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా…”