ఎయిడ్స్ మహమ్మారి నిర్మూలనలో యువత కీలకపాత్ర పోషించాలి
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : ప్రపంచవ్యాప్తంగా విస్తరించినఎయిడ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు యువ త కీలకపాత్ర పోషించాలని తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కే.రాధిక పిలుపునిచ్చారు. కళాశాల మైదా నంలో విద్యార్థులు ట్రేడ్స్ లోగోను ప్రదర్శించారు. ఎయిడ్స్ నియంత్రణపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని ప్రిన్సి పాల్ రాధిక సూచించారు.యువత చెడు వ్యసనాలకు దూరం గా ఉండాలని,బంగారు భవిష్యత్ కోసం పునాదులు వేసుకో వాలని పిలుపునిచ్చారు.