ఎన్కౌంటర్ పై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించిన కలెక్టర్ దివాకర

ఎన్కౌంటర్ పై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించిన కలెక్టర్ దివాకర

– ఎంక్వైరీ ఆఫీసర్ గా ఆర్డీవో

     ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్పై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ దివాకర  ఆదేశాలు జారీ చేశారు. అందుకుగాను ఎంక్వైరి ఆఫీసర్ గా ఆర్డీవోను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువరిం చారు. చిట్యాల రిజర్వు ఫారెస్ట్ పరిధిలోని చెల్పాక అడవుల్లో డిసెంబర్ 1న పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఏటూరునాగారం డీఎస్పీ రిఫరెన్స్ తో ఆ ఎన్కౌంటర్ పై విచారణకు ఆదేశిస్తూ కలెక్టర్ ఉత్వర్వులు వెలువరించారు. ములుగు ఆర్డీవో, సబ్ డివిజ నల్ మెజిస్ట్రేట్ ను విచారణ అధికారిగా నియమించారు. నెల రోజుల వ్యవధిలో పూర్తి విచారణ జరిపి సమగ్ర నివేదికను రికార్డులతో సహా తనకు నివేదించాలని ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment