Ap Train accident : పట్టాలు తప్పిన విశాఖపట్నం రాయగడ ప్యాసింజర్ రైలు.

Written by telangana jyothi

Published on:

Ap Train accident : పట్టాలు తప్పిన విశాఖపట్నం రాయగడ ప్యాసింజర్ రైలు.

డెస్క్ : ఏపీలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలో కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం సంభవించింది. విశాఖ నుంచి రాయగడ వెళ్ళే రాయగడ ప్యాసింజర్ రైలు పలాస నుంచి విజయనగరం వైపు వస్తున్న పలాస ప్యాసింజర్‌ రైళ్లు రెండు ఒకదానికి మరోటి ఢీకొన్నాయి. పట్టాలు క్రాస్ చేస్తుండగా ప్రమాదం సంభవించినట్లు సమాచారం… ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైనట్లు రైల్వే అధికారులు వివరించారు. ప్రమాద ధాటికి రాయగడ ప్యాసింజర్‌ రైలు 3 బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ఘటనాస్థలంలో అంధకారం నెలకొంది. ఎక్కడ ఏం ఉందో చీకట్లో కనిపించని పరిస్థితి, ఘటనాస్థలానికి చేరుకుంటున్న రైల్వే సహాయ సిబ్బంది పోలీసులు చేరుకున్నారు. ప్రమాద ధాటికి ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన తీరును గుర్తుకు తెచ్చుకుంటే వెన్నులో వణుకుపుడుతోందని ప్రయాణికులు అంటున్నారు. ప్రమాద దృశ్యాలు తీరు చూస్తుంటే ప్రాణ నష్టం పెరిగే అవకాశం ఉండొచ్చని తోటి ప్రయాణీకులు భావిస్తున్నారు. ఘటనాస్థలంలో భీతావహ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు బెంబేలేత్తి పోతున్నారు. ప్రమాదంపై రైల్వే హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

హెల్ప్ లైన్ వివరాలు.

హెల్ప్ లైన్లు: 0891 2746330, 0891 2744619

హెల్ప్ లైన్లు: 81060 53051, 81060 53052, 8500041670, 8500041671

రైల్వే హెల్ప్ లైన్లు: 83003 83004, 85005 85006.

Ap Train accident : పట్టాలు తప్పిన విశాఖపట్నం రాయగడ ప్యాసింజర్ రైలు.

Tj news

1 thought on “Ap Train accident : పట్టాలు తప్పిన విశాఖపట్నం రాయగడ ప్యాసింజర్ రైలు.”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now