అక్రమంగా తరలిస్తున్న కర్ర పట్టివేత
– 5ఎడ్లబండ్లు స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ఎడ్ల బండ్లలో అక్రమంగా కలప తరలిస్తుండగా స్వాధీనం చేసుకొని రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు ఎఫ్ఆర్వో డోలి శంకర్ తెలిపా రు. పక్కా సమాచారం మేరకు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బండ్లపాడు సమీపంలో కాపు కాయగా ఐదు ఎడ్ల బండ్లలో ఏడు బిలుగు దిమ్మలు లభ్యమయ్యాయని, ఎడ్ల బండ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఐదుగురు వ్యక్తు లను అదుపులోకి తీసుకొని విచారించగా భూపాలపల్లి జిల్లా దూదేకులపల్లి నుంచి ఆ దిమ్మలను తీసుకొస్తున్నామని, వెంకటేశ్వర్లపల్లికి తరలిస్తున్నట్లు వెల్లడించారని తెలిపారు. వాటి విలువ రూ.1.5లక్షలు ఉంటుందని ఎఫ్ఆర్వో శంకర్ పేర్కొన్నారు. అక్రమంగా కలప తరలిస్తున్న రజాకార్, రాజు, రమేష్, లచ్చుమల్లు, శంకర్ లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ యాకూబ్ జానీ, ఎప్బీవోలు రంజిత్, హనుమంతు, రాజేశ్వరి,శివశంకర్,రాజేష్,బేస్ క్యాంపుసిబ్బంది పాల్గొన్నారు.