అయోధ్య శ్రీరామ జన్మభూమి అక్షింతలకు ఘణ స్వాగతం.
– జై శ్రీరామ్ నామధేయంతో హోరెత్తిన వెంకటాపురం పురవీధులు.
– భారీ స్వాగతం తో వెళ్లి విరిసిన భక్తి భావం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ములుగు జిల్లా వెంకటాపురం పట్టణ కేంద్రానికి శ్రీరామచంద్రమూర్తి యొక్క అక్షింతలు ప్రత్యేక వాహనంలో రావడంతో, భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి అక్షింతలకు కలశాలకు జైశ్రీరామ్ అంటూ ఘన స్వాగ తం పలికారు. మంగళవారం సాయంత్రం నూగూరు వెంకటాపురం చేరుకున్న శ్రీరామ చంద్ర మూర్తి అక్షింతల కలశాల తో వచ్చి న ప్రత్యేక వాహనానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఘనస్వాగ తంతో జై శ్రీరామ, జై జై శ్రీరామ అంటూ స్వాగతం పలికారు. వెంకటాపురం పట్టణంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అయోధ్య శ్రీరామ జన్మభూమి అక్షింతల కళశాలకు ఆలయ అర్చ కులు, వేద పండితులు శాస్త్రోత్త ంగా పూజలు నిర్వహించి, వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామి వారి అక్షింతలకు అమ్మ వారి ముందు కళశాలు వుంచారు. పూజలు అనంతరం శ్రీ కనక దుర్గమ్మ ఆలయ ం వద్ద నుండి అక్షింతల కలశాల తో శోభాయాత్ర భక్తుల జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అనే నినాదాలతో భక్తి రస శోభా యాత్ర కార్యక్రమం పట్టణ పురవీధుల గుండా కొనసా గింది. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న అనేక దుకాణాల వారు,కుటుంభాలు , షాపుల వారు భక్తులు, శ్రీరామ జన్మభూమి ప్రత్యేక అక్షింతల శోభాయాత్రకు శుద్ధి జలంతో నీటిని ఆరబోసి, అత్యంత భక్తి తో స్వాగతం పలికారు. ఈ శోభాయాత్ర కార్యక్రమం వెంకటాపురం ప్రధాన వీధుల గుండా మార్కెట్ సెంటర్, బస్టాండ్ సెంటర్ గుండా కొనసాగి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కు చేరుకుంది. అనేకమంది భక్తులు, భక్తురాళ్ళు శోభాయాత్రలో పాల్గొని జైశ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ స్వామివారి నామస్మరణతో ఘన స్వాగతం పలుకుతూ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శోభాయాత్ర ద్వారా, మంగళ వాయిద్యాల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపించిన అక్షింతలకు పూజలు నిర్వహించారు. భక్తులకు ఆశీర్వ చనాలు పలికారు. విశ్వ హిందూ పరిషత్ ఉమ్మడి వరంగల్ జిల్లా విభాగ్ ప్రచారక్ విగ్నేష్ జి ఆదేశం తో మరియు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామ ట్రస్ట్ అక్షింతలకు స్వాగత సన్నాహాల్లో, శోబాయాత్రలో పాల్గొని, ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భక్తులు జైశ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ జై శ్రీ ఆంజనేయ అంటూ కాషాయ జెండాలతో స్వామివారి అక్షింతల శోభాయాత్ర ముందు వరుసలో నిలబడి, తమ భక్తిని చాటుకున్నారు. పవిత్రమైన అయోధ్య శ్రీరామ జన్మ భూమి అక్షింతలు వెంకటాపురం చేరుకోవడంతో అశేష ప్రజానీకం తమ ప్రాంతానికి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సుల తో, పాడి పంటలు సక్రమంగా పండాలని, సకలజనులు సుఖశాంతుల తో ఉండాలని, స్వామివారిని వేడుకుంటూ, శోభయాత్రలో పాల్గొని, ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ధర్మ జాగరణ సమితి నేత తిరుమలగిరి సతీష్, వేల్పుల ప్రసాద్, భక్తులు , బి. సునీల్, భక్త సోదరిమణులు, పలువురు భక్తులు పాల్గొని స్వామివారి అక్షింతల కు శోభాయాత్రతో, భక్తి ఆశీర్వచనాలు పొందారు.
1 thought on “అయోధ్య శ్రీరామ జన్మభూమి అక్షింతలకు ఘణ స్వాగతం. ”