రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులు మృతి

Written by telangana jyothi

Published on:

రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులు మృతి

– మరొకరికి తీవ్ర గాయాలు.

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, చర్ల ప్రధాన రహదారి వెంకటాపురం మండల శివారు చర్ల మండలం సరిహద్దు లోని ఎదురు గుట్టలు, సుబ్బంపేట ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనం ను లారీ ఢీ కొట్టింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు లారీ టైర్ల కింద పడి చిద్రమయ్యారు. మరో యువకుడు ప్రాణాపాయం నుండి తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అతివేగం గా వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనం ను ఢీకొట్టంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదం పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.  ఈ ప్రమాద సంఘటనపై చర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now