పాఠశాల భవనాన్ని కూల్చిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

పాఠశాల భవనాన్ని కూల్చిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

– ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరన్ డిమాండ్

కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో గల తరగతి గది భవనాలను ఎలాంటి అనుమతులు లేకుండా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా కూల్చి వేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరన్ డిమాండ్ చేశారు. మంగళవారం పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న గ్రామస్తులతో వాస్తవ ప రిస్థితులను అధ్యయనం చేశారు.చిదినేపల్లి పాఠశాల ప్రధానో పాధ్యాయులు, కాంట్రాక్టర్లు కలిసి భవనం కూల్చివేతకు పాల్పడ్డారని, జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి ముందస్తు అనుమతులు లేకుండా భవనాన్ని ఎలా కూల్చివే స్తారని ఆయన ప్రశ్నించారు. శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వ భవనాలను కూల్చాలంటే సంబంధిత శాఖ అధికా రుల సమగ్ర సమాచార నివేదిక మేరకు మాత్రమే చర్యలు చేపట్టాల్సి ఉండగా ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుం డా భవనాన్ని కూల్చడం చట్ట విరుద్ధ చర్యగా బొడ్డు స్మరన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కూల్చివేసిన పాఠశా ల ప్రధానోపాధ్యాయులు, సదరు కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరన్ డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment