క్రిమి కీటక మందు ప్రభావంతో ఇద్దరు చిన్నారులకు అస్వస్థత
క్రిమి కీటక మందు ప్రభావంతో ఇద్దరు చిన్నారులకు అస్వస్థత
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం పట్టణం మంగపేట రోడ్డు వీధికి చెందిన రెండు ఏళ్ళ ఇద్దరు చిన్నారులు శుక్ర వారం సాయంత్రం పక్క ఇంట్లో ఆడుకుంటూ క్రిమిసంహారకు మందు డబ్బాలను తాకి అస్వస్థకు గురయ్యారు. మందు గుళికలను చేతులతో తాకి నాలుకకు అంటించు కోవడంతో చిన్నారులు తీవ్ర అస్వస్థకు గురయి స్పృహ కోల్పోయారు. వెంటనే వారిని వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు చికిత్సకై తరలించారు.అయితే వైద్యశాల సిబ్బం ది పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. రాత్రి సమయంలో 108 వాహనం కూడా అందుబాటు లేదని తల్లి దండ్రులు, బంధు వులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు వాహనంలో ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు చిన్నారులను తరలించారు. ఈ సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.