పాలెం వాగు నుండి సాగు నీళ్ళు ఇవ్వాలని ఈ ఈ కి వినతిపత్రం

పాలెం వాగు నుండి సాగు నీళ్ళు ఇవ్వాలని ఈ ఈ కి వినతిపత్రం
– ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న రైతులకు పాలెం వాగు నుండి సాగు నీళ్ళు అందించాలని గురువారం ఏఎన్ఎస్ నేత, ప్రాజెక్టు ఆయకట్టు రైతు కొర్స నర్సింహామూర్తి పాలెం వాగు ప్రాజెక్ట్ ఈ.ఈ.జగదీష్ కు వెంకటాపురం ప్రభుత్వ విశ్రాంతి భవనం లో వినతిపత్రం అందజేశారు. పాలెం వాగు ప్రాజెక్ట్ నీళ్ళు రాక మొక్కజొన్న పంట ఎండి పోయి అప్పుల భారం తట్టుకోలేక కచ్చులపు చందర్ రావు అనే ఆదివాసీ రైతు ఆత్మ హత్య చేసుకున్నాడని ఈ ఈ కి తెలిపారు. మూడేళ్లుగా సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపో యారని వివరించారు. ప్రధాన కాలువకు ఉన్న తూములకు గేట్లు లేక నీరు మొత్తం వృధా అవుతోందని, తక్షణమే గేట్లు పెట్టాలన్నారు. ముప్పై ఎకరాల విస్తీర్ణం ఉన్న చిరుతపల్లి చెరువుకు ప్రధాన కాలువ నుండి తూము లేక పోవడం కారణంగా చెరువు లోకి నీళ్ళు రావడం లేదని తెలియజేసారు. చెరువు కు నీళ్ళు వచ్చే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేయాలని కోరినారు. కాలువ కు అడ్డు కట్టల వేయడం తో కిందికి నీళ్ళు రాక పొవడం పైన అసహనం వ్యక్తం చేశారు. నీళ్ల కోసం ప్రతియేటా పోరాటం చేయాల్సి వస్తోందని అన్నారు. మొక్క జొన్న పంట ఎండి పోయి చనిపోయిన చందర్ రావు ఆత్మ హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ఈ ఈ జగదీష్ ని డిమాండ్ చేశారు. చనిపోయిన చందర్ రావు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించా లని కోరడం జరిగింది. పిల్ల కాలువల పూడిక తీయమని నర్సింహా మూర్తి కోరగా అది తమ బాధ్యత కాదని, ఎంపిడి ఓ చేత ఎన్. ఆర్. ఈ .జి ఎస్ ద్వారా పూడిక తీపించుకోవాలని ఈ. ఈ .జగదీష్ సూచించారు. సత్వరమే బర్లగూడెం గ్రామ పంచాయతి ఆయకట్టు రైతులకు నీళ్ళు అందేలా చూస్తానని ఈ ఈ జగదీష్ హామీ ఇచ్చారు. రైతులు ప్రవీణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.