కొత్త రేషన్ కార్డు కోసం సర్కారు రెడీ.. అర్హతలు ఇవే..!
డెస్క్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు శుభవార్త వినిపించింది. కొత్త రేషన్ కార్డుల జారీపై సమావేశమైన సబ్ కమిటీ అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాత రేషన్ కార్డుల స్థానంలో కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. స్వైపింగ్ కార్డుల తరహాలో ఇవ్వాలని డిక్లేర్ చేశారు. కొత్తగా పంపిణీ చేసే తెల్లరేషన్ కార్డులు పొందేందుకు లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారి వార్షిక ఆదాయం రూ.లక్షన్నర గానూ, మాగాణి మూడున్నర ఎకరాలు, చెలక ఏడున్నర ఎకరాలుగా ఉండాలని సబ్ కమిటీ నిర్ణయించినట్టు సమాచారం… ఇక పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నవారి వార్షిక ఆదాయం రూ.2లక్షలు ఉన్నవారికే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని యోచిస్తున్నట్టు వినికిడి. రాజకీయాలకు అతీతం గా ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, సభ్యుల ఆలోచనలు, సూచనలను పరిగణలోకి తీసుకుని తుది విధి విధానాలను ఖరారు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సక్సెనా కమిటీ సిఫారసులను పరిశీలించాలని, ఒక కుటుంబానికి ఒకే తెల్లరేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.