మావోయిస్టు పార్టీ కీలక సభ్యుల లొంగుబాటు

Written by telangana jyothi

Published on:

మావోయిస్టు పార్టీ కీలక సభ్యుల లొంగుబాటు

– వివరాలు వెల్లడించిన ఎస్పి శబరీష్

ములుగు ప్రతినిధి : మావోయిస్టు పార్టీ కీలక సభ్యులు ఇద్దరు ములుగు ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ ఎదుట లొంగిపో యారు. మావోయిస్టు పార్టీ కీలకనేత ఆజాద్ ప్రొటెక్షన్ టీం సభ్యుడు దుడ్లతేజ అమర్నాథ్ రెడ్డి అలియాస్ అర్జున్ తోపాటు భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు జిల్లా ఏరియా డివిజన్ కమిటీ సభ్యుడు గాలి నారాయణ రెడ్డి అలియాస్ రాజ్ కుమార్ ల లొంగుబాటుకు సంబంధించిన వివరాలను సోమవారం ఎస్పీ మీడియాకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా వేటపాలం మండలం రెడ్లలంప గ్రామానికి చెందిన దుడ్లతేజ అమర్నాథ్ రెడ్డి మావోయిస్టు నేత ఆజాద్ రక్షణ బృందం ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. ఇంటర్ పూర్తి చేసిన ఆయన నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసిన తన మేనమామ నాయుడు నాగార్జున్ రెడ్డి ప్రోద్భలంతో 2021లో పార్టీలో చేరాడు. అదేవిధంగా గాలి నారాయణ రెడ్డి అలియాస్ రాజ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా చెన్న కొత్తపల్లి మండలం వెర్రంపల్లి గ్రామానికి చెందినవాడు. ఈయన అల్లూరి సీతారామరాజు, భద్రాద్రి కొత్తగూడెం ఏరియా కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇంటర్ చదివిన ఈయన గతంలో హైదరాబాద్ బస్ గ్యారేజీలో పనిచేశాడు. మావోయిస్టు సాహిత్యంతో ప్రేరిపితమై 2020 అక్టోబర్ లో మావోయిస్టు పార్టీలో చేరాడు. 2023లో చింతూరులో పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. 2024ఫ్రిబరిలో జైలు నుంచి విడుదలైన నారాయణ రెడ్డి మళ్లీ మావోల పార్టీలోకి వెళ్లాడు. అమర్నాథ్ రెడ్డి, గాలి నారాయణ రెడ్డిలు ఇద్దరూ ఫేస్ బుక్ ద్వారా మావోయిస్టు నేతలను సంప్రదించారు. ఇరువురూ మొదట కొరియర్లుగా పనిచేసిన అనంతరం వారికి బాధ్యతలు అప్పగించారు. మిలిటెంట్ శిక్షణ కూడా పొందారు. కాగా, జైలు జీవితం అనతరం సమాజంతో కలిసి జీవించాలనే కోరికతో మావోయిస్టు సిద్ధాం తాలను పక్కనపెట్టి పోలీసుల ఎదుట లొంగిపోయిన ట్లు ఎస్పీ శబరీష్ వెల్లడించారు. ఎవరైనా లొంగిపోవాలనుకునే మావోయిస్టులకు భరోసా కల్పిస్తామని, కుటుంబంతో కలిసి బతికేందుకు సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ మహేష్ గీతే, ములుగు డీఎస్పీ రవీందర్ పాల్గొన్నారు.

Leave a comment