ఘనంగా తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘ ఆవిర్భావ దినోత్సవం

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో శుక్రవారం భూమిపుత్ర ఆదివాసి సంఘ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. మండల కేంద్రంలో తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం టీబీఏఎస్ మండల కార్యాలయంలో ఆదివాసి కుల పెద్ద వాసం లక్ష్మయ్య, మహిళా సోదరీమణులు ప్రారంభించారు. అనంతరం తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పూనేం రామచంద్రరావు  జెండాను ఆవిష్కరించారు. ఆదివాసి ఉద్యమ కార్యకర్తలకు, నాయకులకు శ్రేయోభిలాషులకు టీబీఏఎస్ మొదటి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన సంక్షేమ చట్టాలు పకడ్బందీగా అమలు జరిగే విధంగా ప్రతి సభ్యుడు ఉద్యమించి ఆదివాసి గిరిజన హక్కులను పరిరక్షించుకోవాలని పిలుపు నిచ్చారు. గిరిజన సంక్షేమ చట్టాలకు తూట్లు పొడుస్తూ గిరిజనేతర వలసలు పెరిగిపోతున్నాయని, గిరిజనేతరులు, అగ్రవర్ణ భూస్వా మ్య వర్గాలు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకుం టున్నారని, నిరంతరం ఆదివాసి యువత, ఆదివాసీల సమస్యలపై అలు పెరగని పోరాటం చేయాలన్నారు. అలాగే భవిష్యత్తులో భూమి పుత్ర ఆదివాసి సంఘం మరిన్ని విజయాలు చేకూర్చాలన్నారు. అందుకు కార్యకర్తలు సంసిద్ధులై సంఘ బాధ్యతలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో సిద్ధంగా ఉండాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూనెం మునేశ్వరరావు, ములుగు జిల్లా కన్వీనర్ తాటి లక్ష్మణ్, వెంకటాపురం మండల అధ్యక్షులు పొడెం రాజేష్, వాజేడు మండల అధ్యక్షులు ఇరుపలక్ష్మి, సోలం స్వరూప, పూనెం ఉషారాణి, తాటి సుశీల, పూనెం పవన్ కుమార్, పూనెం నాగరాజ్, కోరం ప్రసాద్, ఉండం రామచంద్ర ప్రసాద్, తాటి శ్రీనాథ్, చెరుకుల భాను ప్రసాద్, మడకం గణేష్, గుర్రం సాయి, కోరం సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment