టేకుల బోరు పాఠశాల హెచ్.ఎం లాలయ్యకు ఘనంగా సన్మానం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పెడు వీరాపురం పంచా యతీ టేకులబోరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాధన పెళ్లి లాలయ్య బదిలీపై వెళ్తున్న సందర్భంగా గురు వారం విద్యార్థులు తల్లిదండ్రులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఘనంగా సన్మానం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యా యులుగా ఆరు సంవత్సరాలు పాటు విధులు నిర్వహించి పాఠశాల విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, వారి సేవలు మరవరానివని విద్యార్థులు తల్లిదండ్రులు కొని యాడారు. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ తాటి స్వప్న ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న హెచ్ఎం లాలయ్య కు ఘణంగా సన్మానం నిర్వహించారు. ఆయన సేవలను గుర్తించి న విద్యాశాఖ ఎల్ ఎఫ్ ఎల్ పాఠశాలహెచ్.ఎం గా పదోన్నతపై వి. ఆర్ .కె పురం పాఠశాలకు బదిలీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా ధికారి వెంకటేశ్వరరావు, పాఠశాల హెచ్ఎం విజయలక్ష్మి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ తాటి స్వప్న, ఉపాధ్యా యులు ప్రశాంతి, పరమేశ్వరరావు, పండా రామారావు, గ్రామ రైతులు గడ్డం వివేక్ చౌదరి, విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొని పదోన్నతి పై ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ఎం గా వీఆర్కే పురం బదిలీపై వెళ్తున్న లాలయ్య హెచ్.ఎం.కు ఘనంగా వీడ్కోలు పలికారు. వచ్చేనెల ఆగస్టు నెలాఖరు నాటికి తాను పదవి విరమణ పొందుతున్నానని, తన పదవీ విరమణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలని, తనకు నిర్వహించిన బదిలీ వీడ్కోలు సన్మానానికి పదోన్నతిపై వెళ్తున్న ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం సాధనపల్లి లాలయ్య కృతజ్ఞతలు తెలియ జేశారు.