పేదింట వెలసిన విద్యా కుసుమం

Written by telangana jyothi

Published on:

పేదింట వెలసిన విద్యా కుసుమం

– ములుగు జిల్లా ఉద్యానవన శాఖ అధికారిణి గా నియామకం. 

– వెంకటాపురం పట్టణానికి వన్నెతెచ్చిన చదువుల సరస్వతి లావణ్య. 

– పలువురి అభినందనలు.

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని, ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన కోపిరి లావణ్యను పలువురు అభినందిస్తున్నారు. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పట్టణ కేంద్రానికీ చెందిన కోపిరి సమ్మయ్య నాగమణి దంపతుల కుమార్తె అయిన లావణ్య ను ఉద్యానవన శాఖ ములుగు జిల్లా అధికారినిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. సంబంధిత నియామక ఉత్తర్వులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతులు మీదుగా అందుకుంది. ప్రాథమిక విద్య లో భాగంగా 5వ తరగతి వరకు వెంకటాపురంలో విద్యను అభ్యసించారు. అనంతరం ఎటపాక లోని నవోదయ పాఠశాల లో పదవ తరగతి, పాలేరు నవోదయ లో ఇంటర్మీడియట్ చదివారు. అనంతరం హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీలో బి.ఎస్.సి. హార్టికల్చర్ చదివారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో రాష్ర స్తాఇలో నాలుగు ర్యాంకు సాధించారు. శిక్షణ అనంతరం ఉద్యానవన శాఖ ములుగు జిల్లా అధికారిణిగా లావణ్య ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియామక పత్రాలను అందజేశారు. ఇష్టపడి చదివితే పేదరికం అడ్డు రాదని నిరూపించిన లావణ్య ,జిల్లా అధికారిణి గా నియమిం చడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ములుగు జిల్లా ఉద్యానవన శాఖ అధికారినిగా వెంకటాపురం మండలం పాత్రాపురంలో బుధవారం జరిగిన నాభార్డు కార్యక్రమంలో కే. లావణ్య పాల్గొని మొక్కలు నాటారు .తన స్వగ్రామంలోనే తొలిసారిగా అధికారిక హోదాలో ఉద్యానవన శాఖ జిల్లా అధికారిణిగా పాల్గొనడంతో పలువురు అభినంద నలు తెలిపారు.

Leave a comment