సూరవీడులో టిబి ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం
వెంకటాపురం నూగూరు, మే 7, తెలంగాణ జ్యోతి: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా ఏదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సూరవీడు గ్రామంలో గురువారం టిబి ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సూరవీడు పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీబీ నిర్ధారణ పరీక్షలు, అనుమానితుల గుర్తింపు, తేమడ సేకరణ చేపట్టారు. శిబిరానికి వచ్చిన వారికి ఎక్స్‌రే స్క్రీనింగ్ కూడా నిర్వహించారు. ఏదిర వైద్యాధికారి డాక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇర్ప మురళి, ఉపసర్పంచ్ కోర్స మురళి, డాక్టర్ పవన్ కళ్యాణ్, వైద్య విస్తరణ అధికారి కుప్పిలి కోటిరెడ్డి, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.









