బావి పూడిక తీస్తుండగా కుంగి ఒకరు మృతి
వెంకటాపురం, మే 6, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం సుడిబాక గ్రామంలో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి వద్ద ఉన్న మంచినీటి బావిలో పూడిక తీస్తున్న సమయంలో ఒక్కసారిగా బావి కుంగిపోవడంతో లోపల పనిచేస్తున్న ఆదినారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో మట్టిని తొలగించి ఆదినారాయణను బయటకు తీశారు. అయితే అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.









