ఘట్టమ్మ గుట్టపై హనుమాన్ విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన
ములుగు, మే 8, తెలంగాణ జ్యోతి: ఘట్టమ్మ గుట్టపై శ్రీ హనుమాన్ విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు చర్యలు వేగవంతం అవుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి చింతనిప్పుల బిక్షపతి శుక్రవారం స్థల పరిశీలన నిర్వహించారు. హనుమాన్ భక్త మండలి విజ్ఞప్తి మేరకు విగ్రహ ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లపై స్థానికులతో చర్చించి సంబంధిత అంశాలను పరిశీలించారు. భక్తుల ఆకాంక్ష మేరకు త్వరలోనే విగ్రహ ఏర్పాటు పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి రమేష్, బైకాని నటరాజ్, ఓజ్జెల కుమార్, ఆవుల ప్రశాంత్ రెడ్డి, కొనుపుల కుమార్, శ్రీధర్ స్వామి, బాణాల రాజ్‌కుమార్, ఇమ్మడి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.









