విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలి

విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలి

– రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖా మంత్రి సీతక్క

– ట్రస్మా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

– వరద బాధితులకు రూ.4.5లక్షలు డొనేట్ చేసిన విద్యార్థులు

ములుగు ప్రతినిధి : మంచి మార్కులతో ఉన్నత కొలువులు వస్తాయే తప్ప మంచి గౌరవం దక్కదని, చదువుతోపాటు విలువలు నేర్పాలని రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖా మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. మంగళవారం ములుగులోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో ట్రస్మా (తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్) ములుగు జిల్లా అధ్యక్షుడు పోశాల వీరమల్లు అధ్యక్షతన జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల అభినందన కార్యక్రమానికి ఎంపీ పోరిక బలరాం నాయక్ తో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. 33మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల విద్యా ర్థులు వరద బాధితుల సహాయార్థం సేకరించిన రూ.4.5లక్షల మొత్తాన్ని చెక్కు రూపంలో మంత్రి సీతక్కకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల్లో మంచి భావాలను పెంపొందించాలని, భవిష్యత్తులో మార్కులతో పాటు తల్లిదండ్రులు, గురువులకు విలువ ఇచ్చేలా తయారు చేయాలని సూచించారు. సమాజాన్ని తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రైవేటు పాఠశాల లకు విద్యుత్ కనెక్షణ్ కమర్షియల్ కాకుండా డొమెస్టిక్ రూపంలో అందించేలా చొరవ చూపాలని ట్రస్మా అధ్యక్షుడు వీరమల్లు ఈ సందర్భంగా మంత్రికి విజ్క్షప్తి చేశారు. విద్యార్థు లు వరద బాధితుల కోసం అందించిన మొత్తానికి మరిన్ని డబ్బులు జమచేసి సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తానని మంత్రి పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సరోత్తం రెడ్డి, డీఎస్పీ రవీందర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, ట్రస్మా జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు, కోశాధికారి డి.సురేందర్ రెడ్డి, రాష్ర్ట అధ్యక్షుడు మధుసూదన్, కార్యదర్శి రమేష్ రావు, జిల్లా అడ్వైజర్ కందాల రమేష్, రాష్ర్ట సంయుక్త కార్యదర్వి రవి కిరణ్, ఉపాధ్యక్షులు కోటి రెడ్డి, జలగం మోహన్ రావు, కర్రా రాజేందర్ రెడ్డి, కుమార్, ప్రసాద్, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థు లు పాల్గొన్నారు.