శిశువు మృతి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
శిశువు మృతి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి: వైద్యం అందించడం లో నిర్లక్ష్యం వహించి శిశువు మరణానికి కారణమైన బాధ్యు లపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత మహిళలను కలిసి వివరాలు అడిగి తెలుసుకుని పరామర్శించారు. జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో పుట్ట మధు మాట్లాడుతూ కాటారం మండలo లోనీ దంతాలపల్లి గ్రామానికి చెందిన తోట హరిత గత సోమ వారం కాటారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీ కోసం అడ్మిట్ అవ్వగా డాక్టర్ మౌనిక సాధారణ డెలివరీ అవుతుందని చెప్పి మూడు రోజులు లేబర్ రూమ్ లో ఉంచి సరి అయిన వైద్యం అందించక పోవ డంతో కడుపులో శిశువు చనిపోవడం జరిగిందని అన్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మరణించిందని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రు లలో సరైన వైద్యం అందించడం లేదని ఆరోపించారు. సమస్యలపై స్పందించిన వారిపై అక్రమ కేసు లు నమోదు చేస్తున్నారని, ఈ విషయంపై కలెక్టర్ స్థానిక ఎ మ్మెల్యే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేనియె డల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జోడు శ్రీనివాస్, ఊర వెంకటేశ్వర రావు, మందల లక్ష్మారెడ్డి, పంతకాని సడవలి, నరివెద్ది శ్రీను, జక్కు శ్రావణ్ , వంగళ రాజేంద్రచారి, తదితరులు పాల్గొన్నారు.