అధికారులు పెన్ డౌన్ ఉంటే కూలీలకు ఉపాధి కల్పించరా..?
– కేవలం కాటారం గ్రామపంచాయతీలోనే అనధికారికంగా వింత పోకడ
కాటారం, తెలంగాణ జ్యోతి : కాటారం గ్రామపంచాయతీలో నాలుగు రోజుల నుండి ఉపాధి హామీ కూలీలకు ఉపాధి కల్పించడం లేదని బి ఆర్ ఎస్ నాయకులు జక్కు శ్రవణ్ తెలిపారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, మండలాధికారులను అడగగా, ఫీల్డ్ అసిస్టెంట్లు పెన్డౌన్లో ఉన్నట్లు చెప్పారని, ఏపిఓ ను అడుగగా మేమేం చేయాలి మా పై అధికారులను అడగండి అంటూ పొంతన లేని సమాధానం ఇచ్చినట్లు ఆరోపించారు. పొంతనలేని సమాధానాలు ఒక కాటారం గ్రామపంచాయతీ వరకే పరిమితం అవుతున్నాయని బిఆర్ఎస్ నాయకుడు జక్కు శ్రావణ్ వాపోయారు. జూన్లో వర్షాలు పడితే కూలీలు యధా విధిగా వ్యవసాయ పనులలో నిమగ్నమై వ్యవసాయ కూలీలుగా వెళ్తారు, ఉపాధి హామీ పనులు నడిచేదే ఏప్రిల్, మే మాసంలో, ఈవారం సోమవారం నుండి అనగా ఐదవ తారీకు నుండి ప్రజలకు కూలి పనినీ కల్పించలేకపోయిన మండల అధికారుల పై చర్యలు తీసుకోవాలని, ఒక పక్కన, ప్రక్కనే గల గ్రామ పంచాయతీ కొత్తపల్లిలో ప్రతీ రోజుఎలా ఉపాధి హామీ పనులు కొనసాగుతాయి, కేవలం కాటారం గ్రామపంచాయతీలో మాత్రమే ప్రజలకు, దినసరి కూలీలకు, ఉపాధి హామీ పనులు ఎందుకు కల్పించలేక పోయారో జిల్లా కలెక్టర్ గారు విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అలాగే వెంటనే సంబంధిత అధికారులకు మౌకిక ఆదేశాల ద్వారా రేపటి నుంచి గ్రామ పంచాయతీలోని ఉపాధి హామీ కూలీలలు అందరికీ వెంటనే పనులు కల్పించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని బిఆర్ఎస్ నాయకుడు జక్కు.శ్రావణ్ డిమాండ్ చేశారు.