అంగరంగ వైభవంగా శ్రీవెంకటేశ్వరస్వామి తిరుకళ్యాణం

అంగరంగ వైభవంగా శ్రీవెంకటేశ్వరస్వామి తిరుకళ్యాణం

అంగరంగ వైభవంగా శ్రీవెంకటేశ్వరస్వామి తిరుకళ్యాణం

– తరలివచ్చిన అశేష భక్తజనం.

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురంలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం శుక్రవారం మధ్యాహ్నం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భక్తుల స్వామివారి నామస్మరణ మధ్య  నేత్రపర్వంగా జరిగింది దేవాదాయశాఖ, ఆలయ కమిటి ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు వేసి విస్తృతమైన ఏర్పాట్లు గావించారు. వేలాది మంది భక్తులు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు ఆలయానికి రాగా భక్తులతో ప్రాంగణం కిటకిటలాడింది. తిరుణాల సందర్భంగా వెంకటాపురం ప్రధాన రహదారు లు, ఆలయ ప్రాంగణంలో వంధల దుకాణాలు రకరకాల వస్తువులతో, బొమ్మలతో కొనుగోలుదారులను ఆకర్షిస్తు న్నాయి. స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం సందర్భంగా శుక్రవారం వ్యవసాయ పనులను నిలిపివేశారు. వేలాదిమంది భక్తులు కల్యాణ మహోత్సవాలకు తరలి రావటం తో  వెంకటాపురం పట్టణ ప్రధాన వీధులన్నీ కిట కిట లాడాయి.