మరికాలకు చేరుకున్న శ్రీరామ అక్షింతల కలశాలు. 

Written by telangana jyothi

Published on:

మరికాలకు చేరుకున్న శ్రీరామ అక్షింతల కలశాలు. 

– స్వాగతం పలికిన గ్రామ శ్రీ రామభక్తులు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కమిటీ ఆధ్వర్యంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలం మరికాల పంచాయతీ కేంద్రానికి శ్రీరామ అక్షింతల కలశాలు చేరగా మంగళవారం శ్రీ ఆంజనేయ ఆలయ కమిటీ, గ్రామ భక్తులు అశేష ప్రజానీకం శోభాయాత్రగా మరికాలకు తీసుకువెళ్లారు. మండల కేంద్రమైన వెంకటాపురం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్న అయోధ్య శ్రీ రాముడి అక్షింతల కలశాలను మంగళ వాయిద్యాలు మధ్య జై శ్రీరామ, జై జై శ్రీరామ అంటూ భక్త జనావళి ఊరేగింపుగా మండల కేంద్రంలో సుమారు రెండు కిలోమీటర్ల పొడవున ప్రధాన రహదారిపై శ్రీ కనకదుర్గమ్మ గుడి వరకు శోభాయాత్ర నిర్వహించారు. అక్కడి నుండి ప్రత్యేక వాహనంపై మరికాల శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి గ్రామ శ్రీరామ భక్తజనం, శ్రీరామ జన్మభూమి తీర్ధ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా తీసుకెళ్లారు. మరికాల ఊరు పొలిమేరలో గ్రామస్తులు శ్రీరామ భక్తులు జై శ్రీరామ అంటూ స్వామివారి అక్షింతల కలశాలకు ఘన స్వాగతం పలికారు. శ్రీ ఆంజనేయ స్వామి వారి మందిరం వరకు ఊరేగింపుగా తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా శుద్ధి జలంతో భక్త సోదరిమణులు కళాశాలకు స్వాగతం పలుకుతూ జై శ్రీరామ్ అంటూ ముందు సాగారు. అక్కడ స్వామివారిఅక్షీంతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అయోధ్య శ్రీరామచంద్రమూర్తి అక్షింతల కలశాలను, శ్రీ ఆంజనేయ మందిరంలో పూజలు నిర్వహించారు. ఈ మేరకు గ్రామ పెద్దలు రైతులు బాలసాని శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ సత్యావతి, పాలకవర్గ సభ్యులు, గ్రామ రైతులు,గ్రామపెద్దలు శ్రీరామ భక్త కమిటీ శ్రీ ఆంజనేయ మాల ధారణ భక్తులు, భక్త మహిళా సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని, జై శ్రీరామ జై జై శ్రీరామ అంటూ స్వామివారి అక్షింతలు కలశాలను శ్రీ ఆంజనేయ స్వామి వారి మండపం చుట్టూ ప్రదర్శన నిర్వహించి తమ గ్రామానికి అయోధ్య శ్రీరాముడు పంపించిన అక్షింతల కలశాలను అత్యంత పవిత్రంగా స్వీకరించి, అపూర్వమైన ఆనందకరమైన వాతావరణంతో అక్షింతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఇంటింటికి గడప,గడపకు స్వామివారి అక్షింతలను పంపిణీ చేసి విశ్వవ్యాప్త రామ భక్తులకు శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులతో భక్తిపార వశ్యం తో శుభం కలగాలని ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, శ్రీరామ భక్తులు, శ్రీరామ జయ రామ జయ,జయ రామ అనే విజయ మహా మంత్రంతో సామూహికంగా అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ హనుమాన్ చాలీసా సుందరకాండ,శ్రీ రామ రక్షా స్తోత్రం వంటివి పారాయణం చేస్తూ, భక్తులు కమిటీలుగా ఏర్పడి గ్రామ గ్రామాన గడప,గడపకు ఇంటింటికి పంపిణి పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ చంద్ర మూర్తి అయోధ్య శ్రీ రాముడు విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమా న్ని దూరదర్శన్, మరియు అనేక టెలివిజన్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని ఆ రోజు ప్రతి ఇంటి లో శ్రీరామ భక్తులు ఐదు దీపాలు వెలిగించాలని కోరారు. విశ్వవ్యాప్తంగా కోట్లాది దీపోత్సవాల పండుగ జరపాలని, ఈ సందర్భంగా అందమైన కరపత్రాలను శ్రీరామచంద్ర మూర్తి యొక్క పూజా మహిమల పత్రాలను ఇంటింటికీ అక్షంతలతో పాటు పంపిణీ చేశారు. మరికాల పంచాయతీ పరిధిలోని గ్రామాలలో మంగళవారం జైశ్రీరామ్ జై జై శ్రీరామ జై శ్రీ ఆంజనేయ అనే నినాదాలతో భక్తి రస కార్యక్రమం మార్మోగింది. భక్తులు ముఖ్యంగా మహిళ భక్త సోదరీమణులు, గ్రామ పెద్దలు,రైతులు ఆబాల గోపాలం అందరూ, శ్రీరామచంద్రమూర్తి అయోధ్య అక్షీంతల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని, ఇంటింటికి అక్షింతలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now