అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్
వెంకటాపురం నూగూరు,తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో శుక్రవారం పేరూరు గ్రామపంచాయ తీ పరిధిలోని చిన్న గొల్లగూడెం గ్రామంలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా పేరూరు వారియర్స్ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదివాసి నేత టింగ బుచ్చయ్య పాల్గొని కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి శుక్రవారం క్రీడలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లా సాన్ని పెంపొందిస్తుందని, ఈ క్రీడలు యువతకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ యువత, క్రికెట్ అభిమా నులు పలువురు నాయకులు. పాల్గోన్నారు.