జాతీయ రహదారిపై విస్తృతంగా వాహనాలు తణిఖీలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం అరుణాచల పురం సమీపంలో ప్రధాన రహదారిపై మంగళవారం సాయంత్రం వాజే డు పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వచ్చే పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. ఇంధన శఖట దారులకు ఈ సందర్భంగా రోడ్డు ప్రయాణ భద్రత అంశాలపై అవగాహన కల్పించారు. వాజేడు పి.ఎస్. సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీల కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమంలో సివిల్ మరియు సిఆర్పిఎఫ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
1 thought on “జాతీయ రహదారిపై విస్తృతంగా వాహనాలు తణిఖీలు. ”