మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ సేవలు మరువరానివి
– వెంకటాపురం మండల కాంగ్రెస్ సంతాపం.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ భారతదేశానికి చేసిన సేవలు మరువ రానివని, ఆయన మృతి పట్ల ములుగు జిల్లా వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ శుక్రవారం స్థానిక ప్రభుత్వ అతిధి గ్రహం ఆవరణలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈసందర్భంగా ప్రధాన మంత్రి గా దేశ ఆర్థిక వ్యవస్థను అనేక సంస్కరణలు చేపట్టి ద్రవ్యోల్బణం అరికట్టిన మహానుభావుడని కొనియాడారు. పరిపాలనలో దేశ వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు చేపట్టి దేశాభివృద్ధి ద్యేయం గా ఆయన చేసిన సేవలు భారతావని మర్చిపోకుండా చిరస్మ రణీయం గా ఉన్నాయని కొనియాడారు. సంతాప కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిఎసిఎస్ అధ్యక్షులు చిడెం మోహన్ రావు, సీనియర్ నాయకులు మన్యం సునీల్,ధనపనేని నాగరాజు, జల్లిగంపల కళాధర్ నాయుడు , శ్రీరాముల రమేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టెం సాయి కృష్ణ ,గోగు నాగేశ్వ రరావు, ఇంకా పలువురు నాయకులు, కార్యకర్తలు సంతాప సమావేశంలో పాల్గొన్నారు.