మిస్టరీగా మారిన యువకుడిపై హత్యాయత్నం సంఘటన

మిస్టరీగా మారిన యువకుడిపై హత్యాయత్నం సంఘటన

మిస్టరీగా మారిన యువకుడిపై హత్యాయత్నం సంఘటన

– ఫారెస్ట్ టేకు ప్లాంటేషన్ లో దాడి.

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం పెరిక వీధికి చెందిన చిట్టెం వంశీ అనే యువకుడు పై హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. సేకరించిన వివరాల ప్రకారం…. చిట్టెం వంశీ అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే బుధవారం రాత్రి వెంకటాపురం రంగరాజుపురం ఏడుచర్ల పల్లి రోడ్డు టేకు వనంలో అతనిపై కొంతమంది దాడి చేసినట్లు చర్చించుకుంటు న్నారు. తీవ్రంగా గాయపడ్డ వంశీ గురువారం తెల్లవారుజామున అడవి నుండి మెల్లగా రోడ్డుపైకి వచ్చి సమాచారం ఇచ్చినట్లు, ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఆయన బంధువులు గురు వారం వేకువజామున వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిర్వహించారు. తల, మెడ, వీపు ఇతర భాగాల్లో పదునైన ఆయుధాలతో నరికిన గాయాలు కనపడ్డాయి. అయితే వెంకటాపురం వైద్యశాలలో 18 కి పైగా కుట్లు వేసి ప్రథమ చికిత్స నిర్వహించినట్లు సమాచారం. పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు హుటాహుటిన వరంగల్ హనుమకొండ కార్పొరేట్ ప్రైవేటు వైద్యశాలకు తరలించినట్లు సమాచారం. ఏజెన్సీ ప్రాం తంలో ఆయుధాలతో కొట్లాటలు జరిగిన దాఖలాలు లేవు. అయితే చిట్టెం వంశీ పై దాడి కి పాల్పడిన వారు ఎవరనేది మిస్టరీ గా మారింది. వ్యక్తిగత కక్షలా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. వంశీ పై దాడి సంఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశారా? లేదా? అనే విషయం కూడా తెలియ రాలేదు. చిట్టెం వంశీ యువకుడు పై హత్యాయత్నం, వెంకటాపురంలో చర్చనీయాంశ మైంది.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment