వేసవిలో క్రీడా శిక్షణా శిబిరాలు

జిల్లాలో డి.ఎం. డి.సి.ఎస్.ఓ.లో కంట్రోల్ రూం ఏర్పాటు

వేసవిలో క్రీడా శిక్షణా శిబిరాలు

ములుగు ప్రతినిధి తెలంగాణ జ్యోతి : వేసవి కాలంలో విద్యార్థులకు క్రీడలు నిర్వహించేందుకు గాను శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ చైర్మన్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. మే1వ తేదీ నుంచి జూన్ 6వతేదీ వరకు నిర్వహించబోయే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సోమవారం ప్రకటించారు. ఈ క్యాంపుల నిర్వహణకు 10మంది శిక్షకులను ఎంపిక చేసి శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. వేసవి సెలవులలో శిక్షణ శిబిరాలను ఉపయోగించుకొని ఆసక్తి కలిగిన క్రీడలో నైపుణ్యా లను తీర్చిదిద్దుకునేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రవేశాల కోసం సంబందిత శిబిరం ఇంచార్జ్ లను ఫోన్ ద్వారా గాని, వ్యక్తిగతంగా గాని సంప్రదించాలన్నారు. పూర్తి సమాచారం కోసం 7330326241 నెంబరులో సంప్రదించాలన్నారు. క్రికెట్ క్రీడలో శిక్షణ కోసం శిక్షకుడు పి.సందీప్ నేత్ర (9030130727), ములుగులోని ఫైర్ స్టేషన్ ఎదురు గ్రౌండ్, కరాటే కోసం ఎండీ.నజీర్ హుస్సేన్ (9550483619) ఏటూరునాగారం క్రీడాప రాంగణం, కబడ్డీ పి.జనార్ధన్ (9000336562) మల్లంపల్లి జడ్పీ హై స్కూల్ ప్రాంగణం,సైక్లింగ్ పి.మోహన్ లాల్ (9948817231,93914 10612) మదనపల్లి ప్రైమరీ స్కూల్, రెస్లింగ్ కె.సతీష్ (96765 34013) వెంకటాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్, తైక్వాండో జి.హనుమంత్ (9553782024) వెంకటాపురం కేఫ్డ్ గ్రౌండ్, యోగా కె.శ్రీమతి (8978346864) ములుగు మండలం జగ్గన్న పేట బాలికల ఆశ్రమ జూనియర్ కాలేజీ, వాలీబాల్ వి.నవీన్ (7995312983) కోయవీరాపురం ప్రైమరీ స్కూల్, హాండ్ బాల్ పి.కుమారస్వామి (9666485815) ఏటూరునా గారం క్రీడా ప్రాంగణం, అథ్లెటిక్స్ ఎండీ.కరిష్మా (8522034971) ఆకులవారి గణపురం క్రీడా ప్రాంగణంలో శిక్షణ జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు, విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియో గం చేసుకోవాలన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment